![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -895 లో....అందరూ భోజనం చేస్తుంగా మహేంద్ర ఎక్కడ అని ఫణింద్ర అడుగుతాడు. కాసేపటికి మహేంద్ర తాగి ఇంటికి వస్తాడు. మహేంద్ర పడిపోబోతుంటే రిషి వెళ్లి పట్టుకుంటాడు. అసలు ఇంట్లోకి రావద్దనుకున్న నువ్వు నాకోసం బయట తిరుగుతు ఉంటావని నీ కోసం వచ్చానని రిషితో మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత మహేంద్ర తాగి మాట్లాడతాడు. ఏదో ఒకటి మాట్లాడు అని దేవయానికి శైలేంద్ర సైగ చేయగానే.. మహేంద్రని తిట్టడం స్టార్ట్ చేస్తుంది.. ఏంటి మహేంద్ర రోజు ఇలా తాగి వస్తే ఎలా? ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారని తెలియదు. ఇలా అయితే ఎలా అని దేవయాని రెచ్చిపోయి మాట్లాడుతుంటే బాధలో ఆలా మాట్లాడుతున్నాడని రిషి అంటాడు. ఇంకా ఎక్కువ మాట్లాడకని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. ఛీ ఛీ ఇలా తయారయ్యారేంటి బాధ ఉంటే ఇలా తాగి తందనాలు ఆడాలా అని దేవయాని అనగానే.. ఎవరు ఇక్కడ తాగి తందనాలు ఆడడం లేదని రిషి కోపంగా మాట్లాడుతాడు.
ఇదేం తాగుడు, నాకైతే అర్థం కావడం లేదని దేవయాని అంటుంది. తాగాలి వదిన గారు కుట్రలు చేసి మనుషులని చంపుతుంటే వాళ్ళు రాక్షసులుగా మన చుట్టే ఉంటే ఆ బాధని పోగొట్టుకోవడానికి తాగాలని మహేంద్ర అంటాడు. ఇలా తాగితే మన కుటుంబ పరువు ఏమవుతుంది. మొహం పై ఉమ్మేస్తారు. నేను ఇంట్లో ఉండనని దేవయాని అనగానే.. రిషి కోపంగా ఇక ఆపండి మీరనే ప్రతి మాట నా గుండెలకి గుచ్చకుంటుంది. మా డాడ్ కి ఇంత అవమానం జరిగిన చోట నేను ఉండను. మీరే ఉండండి. మేమే వెళ్ళిపోతామని చెప్తాడు. వసుధారనీ లగేజ్ సర్దమని చెప్తాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదని రిషిని దేవయాని ఆపే ప్రయత్నం చేసినా రిషి మాట వినడు. ఫణింద్ర చెప్పిన రిషి మాట వినడు. జగతి ఫొటోని, మహేంద్రలని తీసుకొని రిషి, వసుధారలు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు.
ఏంటి మమ్మీ.. ఏదో అనమాన్నా అని ఏదో అనేసి వాళ్ళను ఇంట్లో నుండి వెళ్లేలా చేసావని దేవయానిని శైలేంద్ర అంటాడు. కాసేపటికి ఫణింద్ర వచ్చి.. దేవయానిని తిడుతాడు. మరొక వైపు రిషి మహేంద్ర, వసుధార వేరొక ఇంటికి వస్తాడు. ఇది ఎవరి ఇల్లు అని రిషిని వసుధార అడుగుతుంది. ఇది కూడా డాడ్ దే అని రిషి చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర గురించి రిషి బాధపడుతుంటే.. వసుధార ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |